దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 94 ఆఫీసర్ గ్రేడ్- బీ పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: మొత్తం 94 పోస్టుల్లో ఆఫీసర్ గ్రేడ్ బి (డీఆర్)- జనరల్- 66, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్)- డీఈపీఆర్- 21, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్)- డీఎస్‌ఐఎం- 7 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 1 జులై 2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.55,200 నుంచి నుంచి రూ.99,750 వరకు చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.rbi.org.in వెబ్సైట్లో సంప్రదించాలి.